Saturday, February 7, 2026
E-PAPER
Homeజాతీయంమేఘాలయ బొగ్గు గ‌ని పేలుడు..పెరిగిన మృతుల సంఖ్య‌

మేఘాలయ బొగ్గు గ‌ని పేలుడు..పెరిగిన మృతుల సంఖ్య‌

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: ఫిబ్రవరి 5న మేఘాలయలోని ఈస్ట్ జైంతియా హిల్స్ స‌మీపంలో థాంగ్స్కు ప్రాంతంలోని ఒక అక్రమ ‘ర్యాట్ హోల్’ బొగ్గు గనిలో హ‌ఠాత్తుగా పేలుడు సంభ‌వించిన విష‌యం తెలిసిందే. ఈ ప్ర‌మాదంలో మృతుల సంఖ్య 27కు పెరిగింది. సంఘ‌ట‌న స్థ‌లంలో స‌హాయ‌క చర్య‌లు ముమ్మ‌రంగా కొన‌సాగుతున్నాయి. రెస్క్యూ బృందాలు మృత‌దేహాల‌ను వెలికి తీస్తున్నాయి. పేలుడు ధాటికి గని లోపలి భాగం కుప్పకూలిపోవడంతో, లోపల పని చేస్తున్న కార్మికులు శిథిలాల కింద చిక్కుకుని మరణించారు. మృతుల్లో ఎక్కువ మంది అస్సాం, నేపాల్‌కు చెందిన వలస కూలీలే ఉన్నట్లు అధికారులు గుర్తించారు.గాయపడిన మరికొందరు కార్మికులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. గని లోపల గాలి వెలుతురు సరిగ్గా లేకపోవడం, కుప్పకూలిన శిథిలాల వల్ల సహాయక చర్యలకు కొంత ఆటంకం కలుగుతోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -