Sunday, May 4, 2025
Homeతెలంగాణ రౌండప్బడి తాళం పగలగొట్టిన ఘటనపై ఎంఈఓ విచారణ

బడి తాళం పగలగొట్టిన ఘటనపై ఎంఈఓ విచారణ

- Advertisement -

క్షమాపణ కోరిన బాధితులు
నవతెలంగాణ కథనానికి స్పందన
నవతెలంగాణ – మల్హర్ రావు
: మండలంలోని ఇప్పలపల్లి గ్రామపరిదిలోగల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల తాళాన్ని దౌర్జన్యంగా ఇదే గ్రామానికి చెందిన కొందరు హనుమాన్ మాలదారణ స్వాములు పగలగొట్టిన నేపథ్యంలో భక్తి కోసం బడి తాళాలు పగలగొట్టారు. అనే శీర్షిక కథనం నవ తెలంగాణ దినపత్రికలో శనివారం ప్రచురించిన విషయం తెలిసిందే. ఈ కథనానికి మండల విద్యాధికారి లక్ష్మన్ బాబు, పాఠశాల ప్రాధానోపాధ్యాయుడు శ్రీనివాస్, సిఆర్పి అజ్మీరా సమ్మయ్య లు ఆదివారం పాఠశాలకు వెళ్లి విచారణ చేపట్టారు. పాఠశాలలో గ్రామస్తులు, స్వాములను కలసినట్లుగా ఎంఈఓ తెలిపారు. తాళం పగలగొట్టిన సంఘటనను తెలుసుకోవడం జరిగిందన్నారు. అయితే హనుమాన్ మాల ధరించిన స్వాములు పాఠశాలలో ఉండడానికి మొదటగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ ను, పాఠశాల  తాళాలు ఇవ్వాలని కోరగా పాఠశాలలో ఉండడానికి అనుమతి ఇవ్వడం కుదరదని చెప్పడంతో, స్వాములు మండల విద్యాధికారి లక్ష్మణ్ బాబును కూడా ఫోన్ చేసి బడిలో ఉండడానికి పర్మిషన్ అడగడం జరిగిందన్నారు. కానీ ఇందుకు ఎంఈఓ కూడా అక్కడ ఉండడానికి పర్మిషన్ ఇవ్వలేదన్నారు. ఇది స్వాముల సమస్య కాబట్టి ఈ గ్రామపంచాయతీలో మరొక చోట ఉండడానికి ఎక్కడ తగిన స్థలం లేదు కాబట్టి,గత్యంతరం లేక ఈ పాఠశాల యొక్క తాళాలు పగలగొట్టడం జరిగిందని, ఇందులో ఉన్నటువంటి ఎలాంటి  సామాన్లు కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా వీడియో తీస్తూ తళాలు పగలగొట్టి ఇందులో తాము పూజ కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని, ఎంఈఓకు సంజాయిసు ఇచ్చినట్లుగా తెలిపారని ఎంఈఓ పేర్కొన్నారు. అనుకోని విధంగా తాము తీసిన వీడియో వైరల్ అవడం, నవతెలంగాణ పత్రికలో  రావడం జరిగిందని, కావున ఇది మొదటి తప్పుగా భావించి మేము మిమ్మల్ని క్షమించమని కోరుతున్నాము. మరొకసారి ఇలాంటి సంఘటనలు జరగకుండా చూసుకుంటామని హామీ ఇస్తున్నామని, ఎంఈఓకు వివరణ ఇస్తూ.. ఎంఈఓ సమక్షంలో ఆఫీసు రూమ్ కి తాళాలు వేయడం జరిగిందన్నారు. నిరుపయోగంగా ఉన్న రూంలో మాత్రమే ఉండమని  సూచించడం జరిగిందన్నారు. గ్రామస్తులు, స్వాములు ఎంఈఓకు ఇది ఉద్దేశపూర్వకంగా చేసింది కాదని, పాఠశాలలో ఉన్నటువంటి వస్తువులు భద్రంగా మళ్ళి అప్పజెప్పడానికి ఆ ప్రూఫ్ కోసం మేము వీడియో తీశాము అంతే తప్ప ఎలాంటి దొంగతనం జరగలేదు. వేరే ఉద్దేశం ఏమీ లేదు. జరిగిన దానికి క్షమించాలని గ్రామస్తులు కోరడం జరిగింది. ఇదంతా కూడా గ్రామస్తులు స్వాములు, వివరంగా లిఖిత పూర్వకంగా వ్రాసి సంతకాలు చేసి మండల విద్యాధికారి లక్ష్మణ్ బాబు అందజేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -