- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: నైజీరియాలోని ఐసిస్ స్థావరాలపై అమెరికా వైమానిక దాడులు చేసిందని ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్ తెలిపారు. ఇందులో పలువురు ఉగ్రవాదులు మృతి చెందారు. ఈ సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ.. ‘‘నైజీరియాలో క్రైస్తవులపై కొంత కాలంగా ఐసిస్ ఉగ్రవాదులు దాడులు చేస్తున్నారు. ఈ ఊచకోతలు ఆపకపోతే నరకం చూపిస్తానని నేను గతంలోనే హెచ్చరించా. నా హెచ్చరికలను వారు పట్టించుకోలేదు. ఇప్పుడు అనుభవిస్తున్నారు. భారీ ఎత్తున అనేక దాడులు చేశాం. చనిపోయిన ఉగ్రవాదులతో సహా అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు’’ అని ట్రంప్ తెలిపారు.
- Advertisement -



