Wednesday, October 1, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంమెటాకు బ్రెజిల్ ప్ర‌భుత్వం కీల‌క ఆదేశం

మెటాకు బ్రెజిల్ ప్ర‌భుత్వం కీల‌క ఆదేశం

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: లైంగిక అసభ్యకరమైన వ్యాఖ్యలతో కూడిన చాట్‌బాట్‌లను తొలగించాలని బ్రెజిల్‌ ప్రభుత్వం మెటాను కోరినట్లు అటార్నీ జనరల్‌ కార్యాలయం (ఎజియు) తెలిపింది. చిన్నారుల భాష మరియు రూపాన్ని కలిగి ఉన్న ప్రొఫైల్‌లను అనుకరించే మరియు లైంగికంగా అసభ్యకరమైన సంభాషణల్లో పాల్గొనేందుకు అనుమతించే ఎఐ రోబోట్‌లను మెటా వెంటనే తొలగించాలని బ్రెజిల్ ప్రభుత్వం కోరినట్లు ఎజియు సోమవారం ఒక ప్రకటనలో పేర్కొంది.ఇన్‌స్టాగ్రామ్‌, ఫేస్‌బుక్‌ మరియు వాట్సప్‌ల వంటి మెటా ప్లాట్‌ఫామ్‌ల వినియోగదారులు కంపెనీ జనరేటివ్‌ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, (ఎఐ) స్టూడియోను వినియోగించి ఇటువంటి బాట్‌లను సృష్టించే అవకాశం ఉంది.

ఇటువంటి బాట్‌ల విస్తరణను గతవారం మెటాకు పంపిన నోటీసులో ఖండించింది. ఇవి పిల్లల్లో శృంగారాన్ని ప్రోత్సహిస్తున్నాయని పేర్కొంది. మైనర్లుగా నటిస్తున్న బాట్‌లతో లైంగిక సంభాషణలకు సంబంధించిన పలు ఉదాహరణలను నోటీసులో ప్రస్తావించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -