Monday, May 12, 2025
Homeబీజినెస్ప్రారంభించిన 24 గంటలులోగా 8,000 బుక్కింగ్స్ సంపాదించిన MG Windsor PRO

ప్రారంభించిన 24 గంటలులోగా 8,000 బుక్కింగ్స్ సంపాదించిన MG Windsor PRO

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్ : తమ ఇటీవల విడుదల చేయబడిన విండ్సర్ PROను ప్రారంభించిన 24 గంటలు లోగా 8,000 బుక్కింగ్స్ ను సంపాదించిందని JSW MG మోటార్ ఇండియా ఈ రోజు ప్రకటించింది. కార్ ఇప్పుడు 13.09L + రూ. 4.5/కిమీ BaaS ధరకి లభిస్తోంది మరియు ఎక్స్-షోరూం ధర 18,09,800గా ఉంది.

MG Windsor PRO బుక్కంగ్ మైలురాయి పై వ్యాఖ్యానిస్తూ, రాకేష్ సేన్, సేల్స్ హెడ్, JSW MG Motor India ఇలా అన్నారు,MG Windsor PROకి వచ్చిన అనూహ్యమైన ప్రతిస్పందనకు మేము ఎంతో కృతజ్ఞతలు తెలియచేస్తున్నాం. బుక్కింగ్స్ ప్రారంభమైన కేవలం 24 గంటలు లోగా, మేము 8,000 రిజర్వేషన్స్ స్వీకరించాము- ఇది MG Windsorకు ఉన్న శాశ్వతమైన ఆదరణను సూచిస్తోంది మరియు భారతదేశపు EV దృశ్యంలో ప్రథమ స్థానంలో ఉన్న తన  స్థానాన్ని ఇది మరింత శక్తివంతం చేస్తోంది. MG Windsor PROని పరిచయం  చేయడం కేవలం ఒక ముఖ్యమైన ఘట్టం మాత్రమే కాకుండా, భారతదేశపు మరింత సుస్థిరమైన మరియు సాంకేతికత-ప్రోత్సాహిత ఆటోమోటివ్ భవిష్యత్తును తీర్చిదిద్దే దిశగా ఒక గణనీయమైన చర్య. ఇది ఆవిష్కరణ దిశగా  మరియు దేశవ్యాప్తంగా 4W EVల అనుసరణను పెంచడానికి మా మిషన్ యొక్క మా నిబద్ధతను పునర్నిర్ధారిస్తోంది.”

సింగిల్ Essence PRO వేరియెంట్ లో అందించబడిన కొత్త MG Windsor PRO పెద్ద 52.9 kWh బ్యాటరీ ప్యాక్ తో లభిస్తోంది, ధృవీకరించబడిన 449* కిమీ రేంజ్ ను అందిస్తోంది. ఇది 136 PS పవర్ ను మరియు 200 Nm తక్షణ టార్క్ ను అందిస్తోంది, శక్తివంతమైన మరియు సమర్థవంతమైన డ్రైవింగ్ అనుభవాన్ని నిర్థారిస్తోంది. కారులో 12 ప్రధానమైన ఫీచర్లతో లెవెల్ 2 అడ్వాన్స్ డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టంస్ (ADAS) మరియు 3 స్థాయిల హెచ్చరికలు ఉన్నాయి, ఎల్లప్పుడూ తమ ప్రయాణికుల భద్రతను నిర్థారిస్తుంది. MG Windsor PRO వెహికిల్ –టు-లోడ్ (V2L) మరియు వెహికిల్ –టు- వెహికిల్ (V2V) సహా కొత్త టెక్ ఫీచర్లను కూడా కలిగి ఉంది. దీని కనక్టివిటీ మరియు సౌకర్యాన్ని మెరుగుపరుస్తోంది. ఇంకా, Windsor PRO ఇప్పుడు పవర్డ్ టెయిల్ గేట్ ను కలిగి ఉంది మరియు మూడు కొత్త ఆకర్షణీయమైన రంగుల ఆప్షన్స్ లో లభిస్తోంది: సెలడాన్ బ్లూ, ఔరోరా సిల్వర్, మరియు గ్లేజ్ రెడ్ వంటి రంగులతో వాహనం డిజైన్ కు స్టైల్ ను చేరుస్తోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -