నవతెలంగాణ-హైదరాబాద్: మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (MGNREGA) పథకానికి.. వికసిత్ భారత్ రోజ్ గర్ యోజన అజీవికా గ్రామీణ్ మిషన్ అని బీజేపీ ప్రభుత్వం పేరు మార్చిన విషయం తెలిసిందే. కేంద్ర నిర్ణయాన్ని తప్పుబడుతూ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పిలుపునిచ్చిన విషయ తెలిసిందే. ఈక్రమంలో తాజాగా కర్నాటకలో భారీ నిరసన ప్రదర్శన చేపట్టారు కాంగ్రెస్ శ్రేణులు. బెల్గావిలోని సువర్ణా సుధా సమీపంలో మహాత్మా గాంధీ విగ్రహాం వద్ద బైటాయించి మోడీ సర్కార్‌కు వ్యతిరేకంగా పార్టీ శ్రేణులు నినాదాలు చేశారు.
స్వాతంత్య్ర ఉద్యమ సమయంలో నేషనల్ హెరాల్డ్‌ను జవహర్ లాలా నెహ్రు స్థాపించారని, అందుకే కేంద్ర ప్రభుత్వం కక్ష పూరితంగా వ్యవహరిస్తోందని, విచారణ పేరుతో దర్యాప్తు సంస్థలను ఊసుగొల్పుతుందని కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివ కుమార్ విమర్శించారు. నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి కనీసం ఎఫ్ఐఆర్ కాఫీని కూడా దర్యాప్తు సంస్థలు తమకు చూపించలేదని ఆయన మండిపడ్డారు. ఇంత వరకు ఆ కేసుకు సంబంధించి FIRను ఎందుకు తమకు అందివలేదని ఆయన ప్రశ్నించారు. అదే విధంగా మహాత్మా గాంధీ రూరల్ గ్యారెంటీ స్కీమ్..విజయవంతమైన పథకమని, కానీ దురద్దేశంతో జాతిపిత పేరును తొలగించారని మండిపడ్డారు.



