Wednesday, May 14, 2025
Homeఅంతర్జాతీయంమరోసారి భారీగా ఉద్యోగాల కోతకు సిద్ధమైన మైక్రోసాఫ్ట్

మరోసారి భారీగా ఉద్యోగాల కోతకు సిద్ధమైన మైక్రోసాఫ్ట్

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్ : ప్రముఖ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ మరోసారి భారీగా ఉద్యోగాల కోతకు సిద్ధమైంది. 2023లో పది వేల మందిని తొలగించిన ఈ సంస్థ, ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా తమ సిబ్బందిలో మూడు శాతం మందికి లేఆఫ్‌లు ప్రకటించేందుకు సిద్ధమైనట్లు సమాచారం. గత ఏడాది జూన్ నాటికి ఈ సంస్థలో 2.28 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు. తాజాగా మైక్రోసాఫ్ట్ తీసుకున్న నిర్ణయంతో వేలాది మంది ఉద్యోగులపై ప్రభావం పడే అవకాశం ఉన్నట్లు అంచనా.
ఈ అంశంపై సంస్థ ప్రతినిధి ఒకరు సీఎన్‌బీసీతో మాట్లాడుతూ.. మార్కెట్లో పైచేయి సాధించేలా ఉత్తమంగా ఉండేందుకు అవసరమైన సంస్థాగత మార్పులను అమలు చేస్తూనే ఉంటామని తెలిపారు. మేనేజ్‌మెంట్ స్థాయిల నుంచి తగ్గించడం, సంస్థ కార్యకలాపాలను క్రమబద్ధీకరించడమే ముఖ్య లక్ష్యమని పేర్కొన్నారు.
కాగా, ఈ ఏడాది జనవరిలో పనితీరు ఆధారంగా కొంతమందిని సంస్థ తొలగించిన విషయం తెలిసిందే. అయితే తాజా లేఆఫ్‌లకు ఉద్యోగుల పనితీరుకు సంబంధం లేదని సంస్థ స్పష్టం చేసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -