- Advertisement -
- ఏఎస్ఐ శంకర్ రావు హెచ్చరిక
నవతెలంగాణ-బెజ్జంకి
మండలంలోని అయా గ్రామాల్లోని పరిశ్రమలు,కోళ్ల పామ్స్ యందు పనిచేస్తున్న వలస కూలీలు సత్ప్రవర్తనతో ఉండాలని ఏఎస్ఐ శంకర్ రావు హెచ్చరించారు. మంగళవారం రాత్రి మండల క పరిధిలోని గుగ్గీల్ల, బేగంపేట గ్రామాల్లోని పరిశ్రమలు,కోళ్ల పామ్స్ యందు పనిచేస్తున్న వలస కూలీల నివాసాలను ఏఎస్ఐ శంకర్ రావు సందర్శించి పరిసరాలను పరిశీలించారు.ప్రతి ఒక్కరూ రాత్రి వేళల్లో రోడ్లపై సంచరిస్తే చట్టపరమైన చర్యలు చేపడుతామని కూలీలకు సూచించారు.అయా పరిశ్రమలు,కోళ్ల పామ్స్ యాజమాన్యాలు కూలీలపై ప్రత్యేక శ్రద్ధ వహించి అసాంఘిక కార్యకలాపాలు చోటుచేసుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఏఎస్ఐ సూచించారు.
- Advertisement -