Thursday, May 29, 2025
HomeUncategorizedమంత్రి శ్రీధర్ బాబు సహకారంతో మిల్లు అలాట్

మంత్రి శ్రీధర్ బాబు సహకారంతో మిల్లు అలాట్

- Advertisement -
  • – తాడిచెర్ల పిఏసిఎస్ చైర్మన్ ఇప్ప మొండయ్య
    నవతెలంగాణ – మల్హర్ రావు

    రాష్ట్ర ఐటి పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీదర్ బాబు సహకారంతో పెద్దపల్లి జిల్లాలో రైస్ మిల్ ఆలాట్ అయిందని తాడిచెర్ల పిఏసిఎస్ చైర్మన్ ఇప్ప మొoడయ్య, వైస్ చైర్మన్ మల్క ప్రకాష్ రావు, డైరెక్టర్ వొన్న తిరుపతి రావు తెలిపారు. మంగళవారం ప్రాథమిక వ్యవసాయ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు సోమవారం కొందరు కావాలనే రైతులను రెచ్చగొట్టి రాజకీయం చేస్తూ రోడ్డుపై ఆందోళన చేయించారని ఆరోపించారు.
  • రైస్ మిల్ అలాట్ సమస్య ఉంది, త్వరలోనే అలాట్ అవుతుంది, రైతులు ఆందోళనకు గురికావద్దని తాము రైతులకు చెప్పిన కొన్ని గంటల్లో రైతులను ఉసిగొల్పి ఆందోళన చేపట్టేలా చేయడం సరికాదన్నారు.మంత్రి శ్రీధర్ బాబు సహకారంతో రైస్ మిల్లు అలాట్ అయింది, కాబట్టి మండలంలోని 13 కొనుగోలు కేంద్రాల్లో చివరి వరిగింజ వరకు ధాన్యం సేకరిస్తామని, రైతులు భయాందోళనకు గురికావద్దన్నారు.తాడిచెర్ల(వెల్మలపల్లి) ఇప్పటికే 55 లారీల ధాన్యం సేకరించడం జరిగిందని, మరో 10 లారీల ధాన్యం సేకరిస్తామన్నారు.ప్రాథమిక పాలకవర్గం,సిబ్బంది సమన్వయంతో రైతులు సంక్షేమం దృష్టిలో ఉంచుకొని ముందుకు వెళుతున్నట్లుగా చెప్పారు.రైతులు చేపట్టిన ఆందోళన కార్యక్రమాన్నీ కొందరు వక్రీకరించి రాయడం సరికాదన్నారు.
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -