రూ. 2 లక్షలు విలువైన వస్తువులు దగ్ధం
నవతెలంగాణ – పెద్దవూర
షార్ట్ సర్క్యూట్ తో మినీ బ్యాంకు దగ్ధమైన ఘటన పెద్దవూర మండలంలో చోటుచేసుకుంది. బాధితుడు చిట్టిమల్ల సరేష్ తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం మధ్యాహ్నం సమయంలో ఎలక్ట్రిక్ బోర్డులో ఒక్కసారిగా షర్ట్ సర్క్యూట్ కావడంతో షాప్ మొత్తం మంటలు అలుముకొని మినీ బ్యాంకులో ఉన్నటువంటి వస్తువులన్నీ అగ్నికి ఆహుతి అయ్యాయి. మొత్తం రూ.2,00,000/- నష్టం వాటిల్లిందని బాధితుడు తెలిపాడు. వెల్మ గూడెం గ్రామానికి చెందిన చిట్టిమల్ల సరేష్ గత ఏడాది కాలంగా మండల కేంద్రం లోని రామాలయం పక్కన కిరాయికి ఉంటూ మినీ బ్యాంకు నడుపుతున్నారు. మంగళవారం పని ఉండడంతో మినీ బ్యాంకు తీయలేదు. మధ్యాహ్నం 04 గంటల సమయంలో విద్యుత్ షార్ట్ సర్ క్యూట్ కు గురై ఫ్రిజ్, రెండు జిరాక్స్ మిషన్లు, రెండు లాప్ టాపులు, రెండు కంప్యూటర్లు, కౌంటర్, నాలుగు కుర్చీలు దగ్ధమయ్యాయి. మంటలు బారీగా రావడంతో ఎస్ఐ వీరబాబు సంఘటన స్థలానికి చేరుకొని మంటలు ఆర్పీ వేశారు. మినీ బ్యాంకులో వస్తువులు కాలిపోవడంతో బాధితుడు కన్నీటి పర్యంతమయ్యాడు. మంటలు చుట్టు ప్రక్కల వ్యాపిస్తే నష్టం జరిగేది. కాని పోలీసులు చేరుకొని ఎలాంటి ప్రమాదం జరుగకకుండా మంటలు ఆర్పీ వేశారు.
షార్ట్ సర్క్యూట్ తో మినీ బ్యాంకు దగ్ధం..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES