- 99 రోజుల ప్రణాళిక గ్రామసభలో మంత్రి కొండా సురేఖ
నవతెలంగాణ-వర్ధన్నపేట: ప్రజా సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికత పనిచేస్తుందని, రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు.వర్ధన్నపేట మండలం కొత్తపెల్లి గ్రామంలో నిర్వహించిన ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ పై గ్రామసభ నిర్వహించారు. మంత్రితోపాటు వర్ధన్నపేట ఎమ్మెల్యే కే ఆర్ నాగరాజు, వరంగల్ జిల్లా కలెక్టర్ సత్య శారదా దేవిలు హాజరై ప్రభుత్వ కార్యక్రమాలను వివరించారు.
ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ..తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా 99 రోజుల కార్యాచరణలో గ్రామాల అభివృద్ధికి ప్రత్యేక కార్యక్రమం తీసుకుందన్నారు గ్రామ సభలను ప్రజలు సద్వినియోగం చేసుకుని గ్రామ సమస్యలు అధికారులకు తెలిపి పరిష్కరించుకోవచ్చు అన్నారు.
మహిళల సాధికారత కోసం స్వయం సహాయక సంఘాల బలోపేతం, వడ్డీ రహిత రుణాలు, ఆర్థిక సహాయం వంటి పథకాలు అమలు చేస్తున్నామన్నారు . రైతుల సంక్షేమం కోసం రైతు బంధు, రైతు బీమా పెట్టుబడి సహాయం, బీమా రక్షణ కల్పిస్తున్నామన్నారు ఆర్గానిక్ వ్యవసాయానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో పౌష్టికాహారం అందించి బాలల ఆరోగ్యాన్ని కాపాడుతున్నామని, గర్భిణీ స్త్రీలు, బాలింతలకు ప్రత్యేక పోషకాహార పథకాలు అమలు చేస్తున్నామని తెలిపారు.
ఈ సందర్భంగా వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు మాట్లాడుతూ ప్రభుత్వ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను గ్రామస్థాయిలో అమలుపరిచేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజా పాలన ప్రణాళిక కార్యక్రమాలు ప్రజల వద్ద జరగాలని అధికారులను ప్రజా ప్రతినిధులను గ్రామస్థాయికి పంపించారన్నారు. గ్రామ సమస్యలు పరిష్కారంతోపాటు ప్రజల అవసరాలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు సమస్యలు తెలుసుకుని ప్రణాళికతో అభివృద్ధి పథంలోకి నడిచేందుకు ఈ గ్రామసభలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు.
పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాల ద్వారా గ్రామాలు, పట్టణాల్లో మౌలిక. వసతులు. ఏర్పాటు చేసుకోవచ్చన్నారు ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు రెండు సంవత్సరాలు కాలంలోనే ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నప్పటికీ ప్రతిపక్షాలకు ఇవి కనబడకుండా విమర్శలు అభివృద్ధిని అడ్డుకోవడమే వారు పనిగా పెట్టుకుని పక్కదారి పట్టిస్తున్నారని, ప్రజలు గమనిస్తున్నారు గ్రామాలలో పట్టణంలో జరుగు కార్యక్రమాలకు ప్రజలు హాజరై వారి సమస్యలు తెలిపి అభివృద్ధి కోసం పనిచేస్తున్న ప్రభుత్వాన్నీ ప్రోత్సహించాలన్నారు.
కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను వివరించారు. కార్యక్రమంలో జడ్పీ సీఈఓ రామ్ రెడ్డి, ఎంపీడీవో వరంగల్ ఆర్డీవో సుమ, వర్ధన్నపేట వెంకటరమణ, గ్రామ సర్పంచి కౌడగాని సునీత రాజేష్ ఖన్నా,ఐనవోలు దేవస్థానం చైర్మన్ కమ్మగొని ప్రభాకర్ గౌడ్, ఇల్లంద మార్కెట్ చైర్మన్ నరుకుడు వెంకటయ్య, వివిధ శాఖల అధికారులు ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.



