Wednesday, March 18, 2026
E-PAPER
Homeజాతీయంపునర్వికకు భారీ విరాళం ప్రకటించిన మంత్రి లోకేశ్

పునర్వికకు భారీ విరాళం ప్రకటించిన మంత్రి లోకేశ్

- Advertisement -

నవతెలంగాణ – అమరావతి: ఎస్ఎంఏ టైప్-1 అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్న చిన్నారికి ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ అండగా నిలిచేందుకు ముందుకు వచ్చారు. కర్నూలుకు చెందిన బాలిక పునర్విక ఈ వ్యాధితో బాధపడుతోంది. ఆమె చికిత్స కోసం మరో రూ.6 కోట్లు అవసరమని, ఆ మొత్తం అందేలా చూసే బాధ్యత తనదేనని ‘ఎక్స్’ వేదికగా హామీ ఇచ్చారు. తన కూతురు పునర్విక ఎస్ఎంఏ టైప్-1 వ్యాధితో బాధపడుతోందని, చికిత్స కోసం రూ.16 కోట్ల ఇంజెక్షన్ ఒక్కటే ఆప్షన్‌గా ఉందని, దాని కోసం తాను అన్ని రకాలుగా ప్రయత్నించి ప్రజల నుంచి, దాతల నుంచి రూ.10 కోట్ల వరకు సేకరించామని తెలిపారు. మరో రూ.6 కోట్లు అవసరమని పేర్కొంటూ పునర్విక తండ్రి మంత్రి నారా లోకేశ్‌కు ‘ఎక్స్’ ద్వారా విజ్ఞప్తి చేశారు. ఈ విజ్ఞప్తిపై నారా లోకేశ్ స్పందించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -