Monday, May 5, 2025
Homeతాజా వార్తలుమంత్రి పొన్నంతో ఆర్టీసీ సంఘాల నేతలు భేటీ..

మంత్రి పొన్నంతో ఆర్టీసీ సంఘాల నేతలు భేటీ..

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : సమ్మె చేయవద్దని ఆర్టీసీ కార్మికులకు రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. టీజీఎస్ఆర్టీసీ ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది.. సమస్యలు తొలుగుతున్నాయని మంత్రి అన్నారు. ఆర్టీసీకి 16 నెలలుగా ఎన్నో మంచి కార్యక్రమాలు చేశాం.. ఒక్కటైన ఇబ్బంది పెట్టామా? అని మంత్రి ప్రశ్నించారు. సొమవారం మినిస్టర్ క్వార్టర్స్ మంత్రి పొన్నం ప్రభాకర్‌ను పలువురు ఆర్టీసీ సంఘాల నేతలు కలిశారు. ఈ సందర్భంగా ఆర్టీసీ సంఘాల నేతలు ఆర్టీసీ కార్మికుల సమస్యలను మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. ఆర్టీసీ సమస్యలపై ఆర్టీసీ సంక్షేమం కోరే ఎవరైనా నేడు, రేపు ఎప్పుడైనా కలిసి సమస్యలు చెప్పుకోవచ్చు.. మీకు ఎప్పుడూ అందుబాటులోనే ఉంటా అని భరోసా ఇచ్చారు. ఆర్టీసీ సమస్యలు వినడానికి తాను కానీ ముఖ్యమంత్రి కార్యాలయం తలుపులు సైతం ఎప్పుడూ తెరిచే ఉంటాయన్నారు.
ఆర్టీసీ సంస్థ పరిరక్షణ, కార్మికుల సంక్షేమం, ప్రయాణికుల సౌకర్యం ఈ మూడింటికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందన్నారు. ఆర్టీసీ సమ్మె చేస్తే ప్రజలు ఇబ్బందులు పడుతారని చెప్పుకొచ్చారు. గత 10 ఏళ్లుగా ఆర్టీసీని నిర్వీర్యం చేశారని, ఒక్క బస్సు కొనుగోలు చేయలేదని ఆరోపించారు. అలాగే ఒక్క ఉద్యోగం కూడా నియామకం చేయలేదని, సీసీఎస్, పీఎఫ్ పైసలు వాడుకున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. ఆర్టీసీ ఉద్యోగులకు 2013 నుంచి చెల్లించాల్సిన బాండ్ మొత్తం రూ.400 కోట్లు చెల్లించిందన్నారు. 2017 పే స్కేల్ 21% శాతం ఇవ్వడంతో సంవత్సరానికి రూ. 412 కోట్ల భారం పడుతుందని తెలిపారు. పీఎఫ్ ఆర్గనైజేషన్ సుదీర్ఘ కాలంగ పెండింగ్‌లో ఉన్న రూ.1039 కోట్లు చెల్లించామన్నారు. నెలవారీ పీఎఫ్, సీసీఎస్ కంట్రిబ్యూషన్ జనవరి-2024 నుంచి క్రమం తప్పకుండా చెల్లిస్తున్నట్లు పేర్కొన్నారు. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న సీసీఎస్ బకాయిలు ఉద్యోగులకు రూ. 345 కోట్లు రూపాయలు చెల్లించామన్నారు. దాదాపు 1500 మంది కారుణ్య నియామకాలు చేపట్టినట్లు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -