Saturday, March 21, 2026
E-PAPER
Homeజాతీయంపంజాబ్‌లో మంత్రి రాజీనామా..ఆమోదించిన సీఎం

పంజాబ్‌లో మంత్రి రాజీనామా..ఆమోదించిన సీఎం

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: మంత్రి లాల్‌జిత్ సింగ్ భుల్లర్ రాజీనామాను సీఎం భ‌గ‌వ‌త్ మాన్ ఆమోదించారు. టెండ‌ర్ విష‌యంలో మంత్రి త‌న పై ఒత్తిడి చేశాడ‌ని ఆరోప‌ణ‌ల‌తో అమృత్‌సర్‌లోని వేర్‌హౌస్ కార్పొరేషన్ జిల్లా మేనేజర్ గగన్‌దీప్ సింగ్ రంధావా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీనికి ముందు ఒక వీడియో రిలీజ్‌ చేశాడు. తాను విషపదార్థం తీసుకున్నానని తెలిపాడు. రవాణా శాఖ మంత్రి లాల్‌జిత్ సింగ్ భుల్లర్ పేరు ప్రస్తావించాడు. మంత్రి సహాయకుడికి టెండర్ ఇవ్వాలని తనపై ఒత్తిడి తెచ్చారని, దానికి బదులుగా తాను సరైన బిడ్డర్‌ను ఎంచుకున్నానని అతను ఆరోపించాడు. ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.

ఈ వివాదం నేపథ్యంలో మంత్రి లాల్‌జిత్ సింగ్ భుల్లర్ శనివారం తన పదవికి రాజీనామా చేశారు. తనపై వచ్చిన ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవి, అబద్ధాలు అని ఆయన అన్నారు. ‘మా పార్టీ ఎల్లప్పుడూ సత్యాన్ని సమర్థిస్తుంది. సత్యం పక్షాన నిలుస్తుంది. అందుకే నాపై వచ్చిన ఆ ఆరోపణలపై విచారణ జరుగాలని నేను కోరుకుంటున్నా. ఈ విచారణ పూర్తయ్యే వరకు, నా మంత్రి పదవికి రాజీనామాను ఆమోదించాలని పార్టీని, ముఖ్యమంత్రిని అభ్యర్థిస్తున్నా’ అని ఆయన పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -