Sunday, March 1, 2026
E-PAPER
Homeఖమ్మంమంత్రి సాబ్ మైనింగ్ మాఫియా ఆట కట్టండి

మంత్రి సాబ్ మైనింగ్ మాఫియా ఆట కట్టండి

- Advertisement -

– తప్పుడుదారుల్లో అనుమతులు
– అధికారులను బురిడీ కొట్టిచ్చిన రేసింగ్ కాంట్రాక్టర్లు
– కరిగిపోతున్న కళాశాల గుట్టలు
– చోద్యం చూస్తున్న కాలేజీ ప్రిన్సిపాల్
నవతెలంగాణ -చెర్ల: ఏజెన్సీ ఏరియాలో మైనింగ్ మాఫియా ఆగడాలు నానాటికి పెట్టరేకి పోతున్న క్రమంలో ఇసుక రేసింగ్ కాంట్రాక్టర్ల కట్టడికి రెవెన్యూ శాఖ మాత్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చర్యలు చేపట్టాలని స్థానిక ప్రజలు కోరుకుంటున్నారు. ప్రజా ప్రభుత్వంలో ప్రజలందరికీ సౌకర్యవంతమైన పాలన అందించాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రయత్నిస్తూ ఉంటే చెర్లలో కొంతమంది ఇసుక రేసింగ్ కాంట్రాక్టర్లు ఇష్టానికి ప్రవర్తిస్తూ మంత్రి మా మనిషి… ఎవరికి ఏ కష్టం వచ్చిన ఎవరికి ఇబ్బంది కలిగిన …నష్టం వచ్చిన.. అన్ని మూసుకొని కూర్చోవాల్సిందే అంటూ విర్రవీగుతున్న రాజకీయ ముసుగు కప్పుకున్న ఇసుక రేసింగ్ కాంట్రాక్టర్లకు మీరైన బుద్ధి చెప్పాలని స్థానిక నిరుపేదలు మొరపెట్టుకుంటున్నారు. ఒక ఉన్నతమైన పాలన అందించాలని మీరు అహర్నిశలు కష్టపడుతూ ఉంటే ఏజెన్సీలో మీ పేరు చెప్పుకొని కొంతమంది రేసింగ్ కాంట్రాక్టర్లు చలామణి అవుతూ మీ కీర్తి ప్రతిష్టలకు భంగం కలిగిస్తున్నారు. ఎవరు మాట్లాడిన మంత్రిగారి కార్యాలయం నుండి ఫోన్ వస్తదని అధికారులను సైతం భయభ్రాంతులకు గురిచేస్తూ కోట్లు దండుకుంటున్నారు. డబ్బు మైకంలో చిన్న పెద్ద తేడా తెలియకుండా…. మంచి చెడ్డ లేకుండా మాట్లాడుతూ మాట్లాడితే మంత్రి , ఎమ్మెల్యే మనిషిని అంటూ విర్రవీగుతున్నారని వారిని మీరే కట్టడి చేయాలని ప్రజల కోరుతున్నారు.
తప్పుడు దారుల్లో అనుమతులు:
స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో ఉన్న గుట్టను తవ్వి గోదావరిలో రోడ్లు నిర్మించడానికి మైనింగ్ మాఫియా జిల్లా కలెక్టర్ ను సైతం బురిడీ కొట్టించి అనుమతులు పొందిన సంగతి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికంగా రోడ్లు నిర్మించి ఈ ప్రాంత అభివృద్ధి కోసం కాలేజీ ఆవరణలో ఉన్న కొండను తవ్వి రోడ్లు నిర్మించి అభివృద్ధికి పాటుపడతామని చెప్పి మైనింగ్ మాఫియా అడ్డదారుల్లో అనుమతులు తెచ్చుకొని కాలేజీ గుట్టను తవ్వి గోదావరిలో విచ్చలవిడిగా రోడ్లు నిర్మిస్తున్నారు. గత ఏడాది ఆగస్టు నెలలో బురద రోడ్లు బాగు చేయడానికి, నూతన రోడ్లు బలోపేతం చేయడానికి అంటూ కేవలం నామమాత్రంగా కొన్ని మెట్రిక్ టన్నుల గ్రావెల్ పర్మిషన్ తీసుకున్న మైనింగ్ మాఫియా ఇష్టానికి టిప్పర్లతో వేల ట్రిప్పుల గ్రావెల్ తీసుకువెళ్లి గోదావరిలో కలుపుతూ ఉంటే స్థానిక తహసిల్దారు సైతం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నాడని పలువురు మండిపడుతున్నారు. -కరిగిపోతున్న కళాశాల గుట్టలు: ప్రజాజీవనానికి అవసరమైన గ్రావెల్ ఉపయోగిస్తామని అధికారులను వరిడి కొట్టించి రేసింగ్ కాంట్రాక్టర్లు అడ్డదారులు తీసుకున్న అనుమతులతో రాత్రి పగలు తేడా లేకుండా పెద్దపెద్ద యంత్రాలతో ప్రభుత్వ జూనియర్ కళాశాల గుట్టలను ఇష్టానికి తవ్వుతూ గుట్టని కాళీ చేస్తున్నారని స్థానిక ప్రజలు, విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడుతున్నారు.
చోద్యం చూస్తున్న కళాశాల ప్రిన్సిపాల్:
తప్పుడు దారుల్లో అనుమతులు తెచ్చామంటూ నమ్మ పలికి వేల టిప్పర్ల గ్రావెల్ ట్రిప్పులు తోలుకు పోతూ ఉంటే తన ఆస్తిని తాను కాపాడుకోవాల్సిన ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ చోద్యం చూస్తున్నాడని విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడుతున్నారు. తనదైతే సిల్లికవ్వ కూడా బయటికి వెళ్ళనీయలేని పరిస్థితిలో ఉండే అధికారులు ప్రజా సొమ్ము హారతిలా కరిగిపోతూ ఉంటే మౌనం పాటించడంలో తెలియకనే నిజాలు తెలుస్తున్నాయని పెదవిరుస్తున్నారు. ఇప్పటికే విద్యార్థులు తల్లిదండ్రులు పకృతి సిద్ధంగా వచ్చిన కళాశాల ఆస్తిని కాపాడుకోవాలని దరఖాస్తు చేసినప్పటికిని కళాశాల ప్రిన్సిపాల్ పెడచెవిన పెట్టి కోట్ల రూపాయల విలువైన గ్రావెల్ టన్నులకొద్దీ తోలుకొని వెళ్తూ ఉంటే నోరు మెదపకపోవడం కారణం ఏమిటని ఆయన మామూలు మత్తులో ఉన్నారా అని స్థానిక ప్రజలు ఘాటుగా విమర్శిస్తున్నారు. కళాశాల సమీపంలో ఉన్న సాయి నగర్ ప్రజలకు టిప్పర్ల జెసిబి ల రణ గోల రాత్రి పూట నిద్రలేకుండా చేస్తుందని అక్కడ ప్రజలు మండిపడుతున్నారు. రైతు వారీగా ఇంటి ఆవరణలో ఉన్న బురదలో నడవలేక గ్రావెల్ తోలుకోవాలంటే పర్మిషన్ ఇవ్వని తాసిల్దార్ వేల మెట్రిక్ టన్నుల గ్రావెల్ ఇసుక మాఫియా గోదావరిలో పోస్తుంటే నోరు మెదపకపోవడం లో ఉన్న ఆంతర్యం ఏమిటని ప్రజల ప్రశ్నిస్తున్నారు. మంత్రిగారు మీరేనా చొరవచూపి ప్రభుత్వ జూనియర్ కళాశాల సహజసిద్ధ మైన గుట్టలను తవ్వే మైనింగ్ మాఫియా పై కొరడా జులుపుతారని ప్రజలు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -