నవతెలంగాణ – గోవిందరావుపేట : మండలంలోని మొట్లగూడెంలో రాండ్స్టాడ్ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్, సయోధ్య హోమ్ ఫర్ ఉమెన్ ఇన్ నీడ్ వారి సహకారంతో, సమ్మక్క సారలమ్మ అడవి ఆదివాసి సహకార సమాఖ్య అడ్డాకుల ప్లేట్ తయారీ యూనిట్ ను రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క శుక్రవారం ప్రారంభించారు. ప్రారంభ సమయంలో మంత్రితో పాటు అదనపు కలెక్టర్ స్థానిక సంస్థ సంపత్ రావు, మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కళ్యాణి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవి చందర్ లతో కలసి ఈ యూనిట్ ప్రారంభంలో పాలు పంచుకున్నారు.
అంతకుముందు వన మహోత్సవంలో భాగంగా మంత్రి మొక్కను నాటారు. అనంతరం సీతక్క మాట్లాడుతూ ఆదివాసీ మహిళలు ఆర్థికంగా ఎదగడానికి ఈ యూనిట్ ఎంతగానో దోహదపడుతుందని అన్నారు.ఈ కార్యక్రమంలో ఎఫ్ డి ఓ రమేష్, ఎఫ్ ఆర్ ఓ అబ్దుల్ రహమాన్, రాండ్‌స్టాడ్ గ్లోబల్ సంస్థ ప్రతినిధులు అక్యూల్, స్వాప్న విట్టల్, సంయుక్త మిక్కిలినేని, షైల్ దాసికా, సి ఎస్ ఆర్ టిమ్ ప్రణథి పూర్ణ, సైలాజా, వంశీ కృష్ణ, వినయ్ వంగళ, స్మిత కదారి, ప్రజా ప్రతినిధులు, సంబంధిత అధికారులు, మహిళా సంఘాల సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.