నవతెలంగాణ-హైదరాబాద్: మేడారం సమ్మక్క–సారలమ్మ మహా జాతరను ఘనంగా నిర్వహించాలనే లక్ష్యంతో విపక్ష నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రముఖులను స్వయంగా కలిసి ఆహ్వానాలు అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈక్రమంలోనే ఇవాళ ఎర్రవల్లి ఫామ్ హౌస్‌లో మాజీ సీఎం కేసీఆర్‌ను మంత్రులు కలవనున్నారు. మంత్రులు సీతక్క, కొండా సురేఖ కేసీఆర్‌ను మేడారం మహా జాతరకు ఆహ్వానించనున్నారు. ఇప్పటికే మంత్రి సీతక్క ఇప్పటికే పలు రాజకీయ, సామాజిక వర్గాల నేతలను కలిసి మేడారం జాతరకు ఆహ్వాన పత్రికలను అందజేస్తున్నారు. అదే క్రమంలో నేడు కేసీఆర్‌ను కలిసి అధికారికంగా మేడారం ఆహ్వాన పత్రికను అందజేయనున్నట్లు తెలిపారు. మేడారం జాతర రాష్ట్ర సాంస్కృతిక వైభవానికి ప్రతీకగా నిలుస్తుందనే ఉద్దేశంతో అందరినీ ఆహ్వానిస్తున్నామని మంత్రులు పేర్కొన్నారు.
ఎర్రవల్లి ఫామ్ హౌస్‌కు వెళ్లనున్న మంత్రి సీతక్క
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



