Tuesday, August 26, 2025
E-PAPER
spot_img
Homeరాష్ట్రీయందేశమంతా యూరియా కొరతరైతులకు మంత్రి తుమ్మల లేఖ

దేశమంతా యూరియా కొరతరైతులకు మంత్రి తుమ్మల లేఖ

- Advertisement -

నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌
యూరియా కొరత ఒక్క తెలంగాణలోనే కాకుండా దేశమంతా ఉందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు తెలిపారు. రైతులు ఆందోళనలు చేయడం, చెప్పులు క్యూలైన్లల్లో పెట్టడంపై ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న నేపథ్యంలో మంత్రి స్పందిస్తూ రైతాంగానికి బహిరంగ లేఖ రాశారు. యూరియా కొరతకు కారణాలను లేఖలో వివరించారు. ”రాష్ట్రంలో యూరియా కొరతకు రెండు ప్రధాన కారణాలున్నాయి..మొదటిది రాష్ట్రానికి దిగుమతి ద్వారా కేటాయించిన యూరియా ప్రపంచవ్యాప్తంగా జియో పాలిటిక్స్‌ నేపథ్యంలో ఎర్రసముద్రంలో నౌకాయానం నిలిచిపోయింది. ఆగస్టు వరకు రాష్ట్రానికి దిగుమతి ద్వారా 3.94 లక్షల మెట్రిక్‌ టన్నుల యూరియాను కేంద్రం కేటాయిం చింది. కానీ, నౌకాయానం నిలిచిపోవడంతో సమయానికి రాలేదు. రెండో కారణం దేశీయంగా యూరియా ఉత్పత్తి డిమాండ్‌కు తగ్గస్థాయిలో లేకపోవడం. రామగుండం ఫ్యాక్టరీ నుంచి 1,69,325 మెట్రిక్‌ టన్నులు కేటాయించారు. కానీ, ఆ ఫ్యాక్టరీ 1,06,853 మెట్రిక్‌ టన్నులు మాత్రమే సరఫరా చేసింది. 62,473 మెట్రిక్‌ టన్నుల యూరియా కొరత ఏర్పందని’ మంత్రి లేఖలో పేర్కొన్నారు. రామగుండం నుంచి అత్యధిక కేటాయింపులు జరపాలని కేంద్రాన్ని కోరినా ఆ ఫ్యాక్టరీ ఉత్పత్తిలో కేవలం 40 శాతమే రాష్ట్రానికి కేటాయించింది. అయితే, మే నుంచి ఈనెల వరకు 78 రోజులు ఆ ఫ్యాక్టరీలో ఉత్పత్తి జరగలేదు.రాష్ట్రానికి రావాల్సిన యూరియా సమయానికి రాలేదు. యూరియా దిగుమతి లేదు. దేశీయంగా సరఫరా లేదు.దీంతో కోరత ఏర్పడింది. రైతులకు వాస్తవాలు తెలియాలనే ఈ లేఖ రాస్తున్నా’ అని తుమ్మల తెలియజేశారు. ఈమేరకు ఐదు పేజీల బహిరంగ లేఖను సోమవారం మీడియాకు విడుదల చేశారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad