నవతెలంగాణ – హైదరాబాద్: బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీశ్ రావు ఆరోపణలను పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. బీయ్యం కుంభకోణం అనేది నిరాధారమైన ఆరోపణలని ఆయన కొట్టిపారేశారు. హరీశ్ రావు సిఫార్సు చేసిన వారిని అడ్వైజర్లుగా పెట్టుకోలేదనే అక్కసుతోనే సభలో ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రేమ్ చంద్ గార్గ్‌కు ఫిలిప్పీన్స్ బియ్యం ఎగుమతులకు ఎలాంటి సంబంధం లేదన్నారు. ఇది కేవలం తెలంగాణ ప్రభుత్వం, ఫిలిప్పీన్స్ ప్రభుత్వం మధ్య జరిగిన ఒప్పందమని స్పష్టం చేశారు. ఫిలిప్పీన్స్‌లో నెలకొన్న రాజకీయ సంక్షోభం వల్ల అక్కడ అన్ని రకాల దిగుమతులపై ఆంక్షలు విధించారని, అయితే కేవలం తెలంగాణ రైస్ ఇంపోర్టుకు మాత్రమే మినహాయింపు ఇచ్చారని తెలిపారు. కేవలం ఒక్క రేషన్ బియ్యం షిప్మెంట్ మాత్రమే కాకినాడలో ఆగిపోయిందని మంత్రి ఉత్తమ్ వివరణ ఇచ్చారు.
హరీశ్ రావుకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కౌంటర్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



