Wednesday, May 21, 2025
Homeతాజా వార్తలుమంత్రి ఉత్తమ్ హెలికాప్టర్ అత్యవసర ల్యాండింగ్ !

మంత్రి ఉత్తమ్ హెలికాప్టర్ అత్యవసర ల్యాండింగ్ !

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హెలికాప్టర్ కు పెను ప్రమాదం తప్పింది. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హెలికాప్టర్ అత్యవసర ల్యాండింగ్ చేశారు. సూర్యాపేట జిల్లా కోదాడలో మంత్రి ఉత్తమ్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ అత్యవసర ల్యాండ్ ఐంది.

హుజూర్ నగర్ మండలం మేళ్లచెరువులో ల్యాండ్ కావాల్సిన తెలంగాణ రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హెలికాప్టర్… వాతావరణ శాఖ సూచన మేరకు అత్యవసర ల్యాండింగ్ చేశారు. కమ్ముకున్న మబ్బులు, గాలివాన నేపధ్యంలో అప్రమత్తమైన పైలట్… తెలంగాణ రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హెలికాప్టర్ ను అత్యవసర ల్యాండింగ్ చేశారు. కోదాడ నుంచి హుజూర్ నగర్ వరకు 16 కిలోమీటర్లు రోడ్డు మార్గంలో వెళ్లారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇక ఈ సంఘటన పై వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -