”నిబంధనలు ఉల్లంఘిస్తూ… వందల కోట్ల రూపాయలు వెనకేసుకొస్తున్న ఓమంత్రిగారు ఇదేంటి?” అంటూ ఓ ఎమ్మెల్యే చేసిన విమర్శల నేపథ్యంలో సదరు తాజా మంత్రి, మాజీమంత్రి కేటీఆర్‌తో రహస్యంగా భేటీ అయినట్టు తెలిసింది. సర్కారు ఖజానాకు గండికొడుతున్న నిర్వాకం బయటకు పొక్కకుండా ఆయన కేటీఆర్‌తో మేనేజ్ చేసు కున్నట్టు గుసగుసలు. తన రాజకీయ భవిష్యత్తు గంగలో కలుస్తుందనీ, ఎలాగైనా తనను రక్షించాలని సదరు మంత్రి కోరినట్టు ఆ వర్గాల్లో చర్చ. ఈ విషయంలో తనకు సహకరించాలని వేడుకున్నట్టు, అవసరమైనప్పుడు ‘కారెక్కు తానంటూ’ హామీనిచ్చినట్టు తెలిసింది. ఈ విషయం బయటకు పొక్కకుండా ఇద్దరి మధ్య అంగీకారం కుదిరిందట! ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన బీఆర్‌ఎస్‌లో చేరుతానంటే రాకుండా అడ్డుకున్నారు. ఇప్పుడు బీఆర్‌ఎస్ నేత కాంగ్రెస్‌లోకి వస్తానంటే సదరు మంత్రి అడ్డుకుంటున్నారు. దీంతో ఇద్దరి మధ్య ప్రచ్ఛన్న యుద్ధం కొనసాగుతున్నది. ఎలాగైనా సరే మంత్రి బాగోతాలను బయటకు లాగాలనే ప్రయత్నంలో భాగంగా వలవేసి ఆయన అవినీతి చిట్టాను బయటకు తీశారు. దీంతో ఒక్కసారిగా సదరు మంత్రి ఉలిక్కిపడ్డారు. పక్కా ఆధారాలు చూపించడంతో ఆయనకు పగటిచుక్కలు కనిపించాయి. దెబ్బకు ఒక మెట్టు దిగొచ్చారు. ‘సమయం, సందర్భం వచ్చినప్పుడు పార్టీలో చేరు తాను. ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయండి’ అంటూ వేడుకున్నారట.
-గుడిగ రఘు
మంత్రిగారు.. ఇదేంటి?
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES