Friday, May 9, 2025
HomeUncategorizedసిరిసిల్లలో మంత్రి పుట్టినరోజు వేడుకలు..

సిరిసిల్లలో మంత్రి పుట్టినరోజు వేడుకలు..

- Advertisement -

నవతెలంగాణ – సిరిసిల్ల
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో గురువారం గాంధీ చౌరస్తాలో రాష్ట్రమంత్రి పొన్నం ప్రభాకర్ జన్మదిన వేడుకలను కాంగ్రెస్ నేతలు ఘనంగా జరుపుకున్నారు. కేక్ కట్ చేసి పొన్నం ప్రభాకర్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని కాంగ్రెస్ నేతలు పేర్కొన్నారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్ మాట్లాడుతూ పొన్నం ప్రభాకర్ విద్యార్థి దశ నుంచి రాజకీయంలో ఉన్నారని, తెలంగాణ ఉద్యమంలో ఆయన ముఖ్య పాత్ర పోషించడంతోనే తెలంగాణ రాష్ట్రం సాధించడం జరిగిందని సత్యనారాయణ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు చొప్పదండి ప్రకాష్, సంగీతం శ్రీనివాస్, ఆకునూరి బాలరాజు, సూరదేవరాజు ,ఆడెపు చంద్రకళ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -