నవతెలంగాణ-చిన్నకోడూరు
మైనర్ బాలిక పురుగుల మందు సేవించి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మండల పరిధిలోని కమ్మర్లపల్లి గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. స్థానికులు చిన్నకోడూరు ఎస్సై చంద్రమోహన్ తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన కొమ్ము రాజుల లావణ్య – రవి ల కూతురు దివ్య తేజ (17) అదే గ్రామానికి చెందిన కొమ్మురాజుల సమ్మవ్వ -మల్లయ్య కుమారుడు శ్రీనివాసులు గత కొంతకాలంగా ఇద్దరు ప్రేమించుకుంటున్నారు.
శ్రీనివాసు దివ్య తేజ లు వరుసకు అన్నా చెల్లెలు కావడంతో ఇరు కుటుంబాలు ప్రేమకు విభేదించారు. గత సోమవారం రోజున దివ్య తేజ పురుగుల మందు సేవించింది. గమనించిన కుటుంబ సభ్యులు సిద్దిపేట జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజామున దివ్య తేజ మరణించిందని డాక్టర్లు నిర్ధారించారు. ఈ సంఘటనపై దివ్య తేజ తండ్రి రవి పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సైతెలిపారు.



