- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: దేశ రాజధాని ఢిల్లీలో దారుణ ఘటన చోటుచేసుకుంది. నగర కేంద్రంలో నడుచుకుంటూ వెళ్తున్న మైనర్ బాలికను ముగ్గురు యువకులు కారులో బలవంతంగా ఎక్కించుకుని నిర్మానుష్య గోదాంలోకి తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. స్పృహలోకి వచ్చాక ఇంటికి చేరుకుని కుటుంబ సభ్యులకు చెప్పడంతో విషయం వెలుగులోకి వచ్చింది. బాధితురాలి తండ్రి ఫిర్యాదుతో పోక్సో చట్టం, ఐపీసీ సెక్షన్ 376D కింద పోలీసులు కేసు నమోదు చేశారు. సీసీటీవీ ఫుటేజ్, బాధితురాలి ఆధారాలతో నిందితుల కోసం గాలిస్తున్నారు.
- Advertisement -



