నవతెలంగాణ – బాల్కొండ : ఇంటర్మీడియట్ ఫలితాలలో మండల కేంద్రంలోని మైనారిటి కళాశాల విద్యార్థినిలు తమ సత్తా చాటారు. ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరంలో 95% , ద్వితీయ సంవత్సరంలో 100% ఫలితాలు సాధించారని కళాశాల ప్రిన్సిపాల్ చందన తెలిపారు. ఇందులో ఫస్టియర్ బై.పి. సి లో ప్రథమ స్థానం నవీన 431/440, ద్వితీయ స్థానం ఫైజా బుతుల్ 429/440, సానియా 414/440 మార్కులతో తృతీయ స్థానం సాధించారు.
ఫస్టియర్ ఎంపిసిలో జారఫ్షా 451/470 ప్రథమస్థానం, హరిణి 450/470 ద్వితీయ స్థానం, శ్రీహిత 444/470 తృతీయ స్థానం సాధించారు.
సెకండియర్ బైపిసి లో రిమ్షా 991/1000 ప్రథమ స్నానం,నేహా 985/1000 ద్వితీయస్థానం, హర్షిని 967/1000 తృతీయ స్థానం సాధించారు.
సెకండియర్ ఎంపీసీ లో బరీర 993/1000 ప్రథమ స్నానంలో, నవ్య 987/1000 ద్వితీయసానంలో, కీర్తి 982/1000 తృతీయస్థానంలో నిలిచారు.ఈ విధంగా ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు కళాశాల ప్రిన్సిపాల్ చందన, ఉపాధ్యాయ బృందం అభినందనలు తెలిపారు.



