నవతెలంగాణ-హైదరాబాద్: వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లో బీహార్‌లో ఈసీ చేపట్టిన ఎస్ఐఆర్‌పై చర్చ జరగాలని ప్రతిపక్షాలు 17రోజులు డిమాండ్ చేస్తున్నాయి. తాజాగా పార్లమెంట్ ఆవరణలో ఇండియా కూటమి ఎంపీలు వినూత్న రీతిలో బీహార్ సార్ పై నిరసన వ్యక్తం చేశారు. మింతాదేవీ 124 నాట్ ఔట్ అంటూ రాసిన టీ షెర్టులు ధరించి..ఈసీని ఎంపీలందరూ ఎద్దేవా చేశారు.
ఇటీవల బీహార్ లో సవరించిన ఓటర్ జాబితాను ఎన్నికల సంఘం విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే ఇటీవల కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఓట్ల చోరీ అంశంలో ఇచ్చిన ప్రజెంటేషన్‌లో బిహార్‌కు చెందిన మింతా దేవి గురించి ప్రస్తావించారు. మింతా దేవి పేరుతో ఉన్న ఓటరు ఐడీలో ఆమె వయస్సు 124 అని ముద్రించినట్లు రాహుల్ పేర్కొన్నారు. దీంతో ప్రపంచంలోనే అత్యధిక వయస్సు ఉన్నా వ్యక్తిగా మింతాదేవీ రికార్డు సృష్టించిందని, ఈ క్రెడిట్ ఎన్నికల సంఘానికి దక్కుతుందని కూటమి ఎంపీలందరూ ఈసీ సెటైర్లు వేశారు.
