Sunday, September 14, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంమిస్‌ ఇంగ్లాండ్‌ మిల్లా మాగి ఆరోపణలపై విచారణ జరపాలి

మిస్‌ ఇంగ్లాండ్‌ మిల్లా మాగి ఆరోపణలపై విచారణ జరపాలి

- Advertisement -

బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ డిమాండ్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

మిస్‌ ఇంగ్లాండ్‌ మిల్లా మాగి ఆరోపణలపై సమగ్ర విచారణ జరపాలని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ఆదివారం ఎక్స్‌ వేదికగా స్పందించారు. ”మిస్‌ వరల్డ్‌ లాంటి అంతర్జాతీయ వేదికలపై మహిళల పట్ల వివక్షాపూరిత ఆలోచనలు ఉన్న మెంటాలిటీనీ ఎదిరించడానికి చాలా ధైర్యం కావాలి. తెలంగాణలో మీరు ఇలాంటి అనుభవాన్ని ఎదుర్కొన్నందుకు మేం చింతిస్తున్నాం. ఇక్కడ మహిళలను గౌరవించే గొప్ప సంస్కృతి ఉంది. మహిళలను పూజిస్తాం, గౌరవిస్తాం, వారి అభివృద్ధికి సమాన అవకాశాలను కల్పిస్తాం. రాణి రుద్రమ, చిట్యాల ఐలమ్మ వంటి గొప్ప నాయకులు మా తెలంగాణ మట్టిలో పుట్టినవారే” అని కేటీఆర్‌ తన ఎక్స్‌ ఖాతాలో పేర్కొన్నారు. మీరు ఎదుర్కొన్న ఈ చేదు అనుభవం నిజమైన తెలంగాణను ప్రతిబింబించేది కాదని అన్నారు. ఏ ఒక్క మహిళ గానీ, ఆడపిల్ల గానీ ఇలాంటి భయానక అనుభవాలను ఎదుర్కోకూడదనీ, ఒక అమ్మాయికి తండ్రిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని పేర్కొన్నారు. బాధితురాలిని విమర్శించడం, ఆమెను తప్పుగా చూపించడం మాని ఆరోపణలపై సమగ్ర విచారణ జరపాలని కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -