నవతెలంగాణ-హైదరాబాద్ : హైదరాబాద్‌లో జరుగుతున్న ప్రపంచ సుందరి పోటీలు కీలక ఘట్టానికి చేరుకుంటున్నాయి. 109 దేశాల భామలు మిస్ వరల్డ్ కిరీటాన్ని సొంతం చేసుకునేందుకు పోటీపడుతుండగా.. అమెరికా కరేబియన్, ఆఫ్రికా, యూరప్, ఆసియా-ఓషియానా కాంటినెంటల్ క్లస్టర్ల నుంచి వివిధ అంశాల వారీగా ఎంపిక ప్రక్రియ మొదలైంది. సోమవారం నిర్వహించిన టాలెంట్ కాంపిటిషన్ సెకండ్ రౌండ్ నుంచి క్వార్టర్ ఫైనల్స్‌కు 48 మందిని ఎంపిక చేశారు. ఇంకా ఈ విభాగంలో నేపాల్, హైతీ, ఇండోనేసియా సుందరీమణులు ప్రతిభను నిరూపించుకోవాల్సి ఉన్నట్లు మిస్‌వరల్డ్ నిర్వాహకులు తెలిపారు. ఇందులో ఎంపికైన వారూ క్వార్టర్ ఫైనల్స్‌కు చేరుతారు. టీ హబ్‌లో మంగళవారం, బుధవారం కాంటినెంటల్ ఫినాలేలు జరగనున్నాయి.
మిస్ వరల్డ్ క్వార్టర్ ఫైనల్స్‌కు 48 మంది..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES