Friday, May 16, 2025
Homeతాజా వార్తలుచేనేత చీరకట్టులో ప్రపంచ అందాల భామల సందడి

చేనేత చీరకట్టులో ప్రపంచ అందాల భామల సందడి

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : మిస్ వరల్డ్ పోటీదారుల బృందం యాదగిరిగుట్టను సందర్శించారు. భారతీయ సంప్రదాయ చీరకట్టులో ఆలయాన్ని దర్శించుకున్నారు. విదేశీ అతిథుల పర్యటన దృష్ట్యా గుట్టలో సాధారణ భక్తుల దర్శనాలు, జోడు సేవలకు బ్రేక్ ఇచ్చారు. ఈ సందర్భంగా ప్రపంచ అందగత్తెలకు ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం స్వామివారిని దర్శించుకొని అఖండదీపారాధనలో పాల్గొన్నారు. మరోవైపు భూదాన్ పోచంపల్లిని మరో పోటీదారుల బృందం సందర్శిస్తోంది. ఆఫ్రికన్ దేశాలకు చెందిన 25 మంది ప్రపంచ సుందరీమణుల ఆ బృందంలో ఉన్నారు. వీరి పర్యటన సాయంత్రం 6 గంటల నుంచి మొదలుకొని 8 గంటల 30 నిమిషాల వరకు కొనసాగనుంది. ప్రపంచ సుందరీమణుల పర్యటనకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను పూర్తిచేసినట్లు జిల్లా కలెక్టర్ హనుమంతరావు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -