నవతెలంగాణ-హైదరాబాద్ : 2025 మిస్ వరల్డ్ పోటీలకు తెలంగాణ ముస్తాబైన విషయం తెలిసిందే. ఈనెల 7 నుంచి 31 వరకు పోటీలు కొనసాగనున్నాయి. పోటీల్లో మొత్తం 120 దేశాల నుంచి యువతులు పాల్గొననున్నారు. ఈ క్రమంలోనే మిస్ వరల్డ్ లిమిటెడ్ చైర్‌పర్సన్, సీఈవో జూలియా ఈవేలిన్ మోర్లీ ఇవాళ ఉదయం నగరానికి చేరుకున్నారు. ఈ మేరకు ఆమెకు శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఆమెకు సంప్రదాయరీతిలో అధికారులు ఘటన స్వాగతం పలికారు.
రేపటి నుంచి మిస్ వరల్డ్ పోటీల ఏర్పాట్లను జూలియా సమీక్షించనున్నారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వంతో ఈ భాగస్వామ్యం కుదుర్చుకోవడం ప్రపంచ ప్రేక్షకులకు రాష్ట్ర అద్భుత వారసత్వాన్ని చూపించడానికి ఉపయోగపడుతుందని అన్నారు. మిస్ వరల్డ్ పోటీలను నిర్వహించడం గురించి మాత్రమే కాదు, మహిళలకు సాధికారత కల్పించడం, అందం పట్ల ఐక్యంగా ఉండే మన నిబద్ధత, స్థిరమైన ప్రభావాన్ని చూపుతాయని జూలియా అన్నారు.
హైదరాబాద్‌కు చేరుకున్న మిస్ వరల్డ్ లిమిటెడ్ చైర్‌పర్సన్..
- Advertisement -
RELATED ARTICLES