-మళ్లీ అవకాశం కల్పించాలి నిరుద్యోగ యువతి యువకులు
నవతెలంగాణ -తాడ్వాయి : మండలంలో ని బీరెల్లి గ్రామపంచాయతీలో పరిధిలోని ఆశన్నగూడ ఎల్లాపూర్ గ్రామానికి చెందిన ఆదివాసీ గిరిజన యువతి యువకులు సమాచార లోపంతో సోమవారం మంగళవారం నిర్వహించిన రాజీవ్ యువ వికాసం పథకం అప్లై చేసుకున్న నిరుద్యోగ యువతీ యువకులు ఇంటర్వ్యూలకు హాజరు కాలేకపోయామని బీరెల్లి మాజీ వార్డ్ మెంబర్ ఆశన్నగూడ ఎల్లాపూర్ వాసి ఈసం సమ్మయ్య, వట్టం జయసుధ, ఈసం అనసూర్య, కుంజ అనిత, ఈసం పాపయ్య లు ఆవేదన చెందారు. ఒక రోజు ముందు డప్పు చాటింపుతో టామ్ టామ్ వేయించాల్సిన అధికారులు, ఆ పని చేయలేదు. బీరెల్లి గ్రామపంచాయతీకి కిలోమీటర్ దూరంలో అడవి ప్రాంతంలో ఉన్నామని మాకు ఎలాంటి సమాచారం దానికి సంబంధించిన అధికారులు ఎవరూ సమాచారం ఇవ్వలేదు అన్నారు. ఆన్లైన్లో ఇబ్బంది అయితే ఆఫ్లైన్లో కూడా అప్లై చేసుకున్నామని ఎన్నో తంటాలు పడి అప్లై చేసుకున్న రాజీవ్ యువ వికాసం పథకానికి ఇంటర్వ్యూలకు సమాచారం ఇవ్వలేదని ఆవేదన చెందారు. ఒక్కరోజు ముందు బీరెల్లి సోషల్ మీడియా గ్రూపులో కార్యదర్శి పెట్టాడని, ఆ గ్రూపులో మా ఆదివాసి గ్రామానికి చెందిన వారం లేమని వారు ఆవేదన చెందారు. అధికారులు స్పందించి సమాచార లోపంతో ఇంటర్వ్యూలకు కాని వారం 15 మందిని ఉన్నామని మమ్ములను రాజీవ్ యువ వికాస్ పథకానికి అర్హులుగా తీసుకోవాలని వారు అధికారులను కోరుతున్నారు.
సమాచార లోపంతో రాజీవ్ వికాసం పథకం ఇంటర్వ్యూ కు మిస్..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES