నవతెలంగాణ-హైదరాబాద్: భారత్ దాడులతో పాక్ ప్రభుత్వం అల్లాడిపోతుంది. దీంతో రెండు దేశాల సరిహద్దు ప్రాంతాలపై దాయాది దళాలు భీకర దాడులకు తెగబడుతున్నాయి. దీంతో భారత్ సైన్యం బార్డర్ ఏరియాలపై హైఅలర్ట్ ప్రకటించింది. గట్టి నిఘా ఏర్పాటు చేసి పాక్ నుంచి వచ్చే డ్రోన్ల దాడులను భగ్నం చేస్తోంది. ఈ క్రమంలో సరిహద్దు ప్రాంతమైన రాజస్థాన్ లో పేలకుండా పడిపోయిన ఓ క్షిపణిని సైనిక అధికారులు స్వాధీనం చేసుకున్నారు. శనివారం తెల్లవారుజామును బార్మూర్ లోని గిడ పరేవు అనే ప్రాంతంలో ఆ మిస్సైల్ ను గుర్తించినట్టు బార్ఢర్ అధికారులు తెలిపారు. అంతేకాకుండా ఇండియన్ ఆర్మీని ఢీకొనలేక..జమ్మూకశ్మీర్‌లోని పూంచ్, ఉరి, కుప్వారా తదితర ప్రాంతాల్లో పౌరుల నివాసాలే లక్ష్యంగా పాక్ ఆర్మీ దాడులు చేస్తున్న విషయం తెలిసిందే. అప్రమత్తమైన భారత్ బలగాలు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఆయా సరిహద్దు పరిసర ప్రాంతాలపై అధికారులు గట్టి నిఘా ఏర్పాటు చేశారు.
బార్ముర్‌లో క్షిపణి స్వాధీనం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES