- Advertisement -
నవతెలంగాణ-రెంజల్: నిజామాబాద్ జిల్లా మండల కేంద్రమైన రెంజల్ గ్రామానికి చెందిన అంగపట్నం సావిత్రి అదృశ్యమైంది. గతనెల 16న అందాజ సాయంత్రం నాలుగు గంటలకు ఇంట్లో నుండి వెళ్లిపోయింది.నేటి వరకు తిరిగి ఇంటికి తిరిగిరాలేదని బాధితులు వాపోయారు. ఆమె భర్త అంగపట్నం గంగాధర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు రెంజల్ ఎస్సై చంద్రమోహన్ తెలిపారు. ఇప్పటివరకు తమ బంధువుల ఇళ్లల్లో వెతికినా ఆచూకీ తెలియకపోవడంతో శనివారం సాయంత్రం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
- Advertisement -