Thursday, May 15, 2025
Homeజాతీయంరాష్ట్రప‌తి వ్యాఖ్య‌లపై స్పందించిన ఎంకే స్టాలిన్

రాష్ట్రప‌తి వ్యాఖ్య‌లపై స్పందించిన ఎంకే స్టాలిన్

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైదరాబాద్‌: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సుప్రీం కోర్టుకు రాసిన లేఖపై సీఎం స్టాలిన్ స్పందించారు. రాష్ట్రపతి లేఖ రాజ్యాంగాన్ని దుర్వినియోగం చేసే ప్రయత్నమని ఆరోపించారు. ఈ చర్య రాజ్యాంగం గౌరవాన్ని సుప్రీంకోర్టు అధికారాన్ని సవాలు చేస్తుంద‌న్నారు. ఇప్పటికే తమిళనాడు గవర్నర్ విషయంలో సుప్రీం కోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చిందని గుర్తుచేశారు. రాష్ట్రప‌తి ఆమోదానికి పంపిన బిల్లుల‌పై ప్రెసిడెంట్ కు గ‌డువు విధిస్తూ సుప్రీంకోర్టు తీర్పు వెల్ల‌డించిన విష‌యం తెలిసిందే. ఈ తీర్పుపై ద్రౌప‌ది ముర్ము స‌ర్వోన్న‌త స్థానానికి 14 ప్ర‌శ్న‌లు సంధించారు. రాజ్యాంగంలో అలాంటి నిబంధనలేవీ లేనప్పుడు కోర్టు అలా ఎలా తీర్పు ఇచ్చిందని ముర్ము ప్రశ్నించారు. ఈ వ్యాఖ్య‌ల‌పై త‌మిళ‌నాడు సీఎం స్పందించారు. అదే విధంగా గ‌త నెల‌లో ఉప‌రాష్ట్రప‌తి జ‌గ‌దీష్ ధ‌న్‌ఖ‌డ్ కూడా సుప్రీం కోర్టు తీర్పును ఖండించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -