నవతెలంగాణ – హైదరాబాద్: కేరళకు చెందిన కాంగ్రెస్ బహిష్కృత ఎమ్మెల్యే రాహుల్ మామ్ కూటతిల్ ను పోలీసులు శనివారం అర్ధరాత్రి అరెస్టు చేశారు. ఆయనపై నమోదైన మూడో లైంగికదాడి ఫిర్యాదు కేసులో ఈ మేరకు చర్యలు తీసుకున్నారు. గతంలో నమోదైన లైంగికదాడి కేసుల్లో కేరళ హైకోర్టు నుంచి, మరో కేసులో ట్రయల్ కోర్టు నుంచి రాహుల్ ముందస్తు బెయిల్ పొందారు. ఈ లైంగికదాడి ఆరోపణలు, కేసుల నేపథ్యంలో రాహుల్ ను కాంగ్రెస్ పార్టీ బహిష్కరించింది. అయితే, తాజాగా ఆయనపై మరో లైంగికదాడి కేసు నమోదైంది. సీఎంవో ఆఫీసుకు మెయిల్ ద్వారా రాహుల్ పై ఓ యువతి ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదును సీఎంవో క్రైమ్ బ్రాంచ్ కు పంపగా.. విచారణ నిమిత్తం ఎమ్మెల్యేను అరెస్టు చేసినట్లు ఉన్నతాధికారులు తెలిపారు. ఈమెయిల్ లో బాధితురాలు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఎమ్మెల్యే రాహుల్ తనపై లైంగికదాడి చేశాడని, తన అభీష్టానికి వ్యతిరేకంగా అబార్షన్ చేయించాడని ఆరోపించింది.
లైంగికదాడి కేసులో ఎమ్మెల్యే అరెస్ట్..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



