నవతెలంగాణ – పెద్దవంగర
మండలంలోని బావోజీ తండాకు చెందిన కాంగ్రెస్ నాయకుడు బానోత్ రాంసింగ్- సునిత దంపతుల కుమార్తె సునీత- రఘురాం వివాహ వేడుకలు బుధవారం ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి హాజరై నూతన వధూవరులకు పట్టువస్త్రాలు అందించి, ఆశీర్వదించారు. ఆమె వెంట కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ముద్దసాని సురేష్, మండల ఇంచార్జి విజయ్ పాల్ రెడ్డి, ఏఎంసీ డైరెక్టర్ బానోత్ గోపాల్ నాయక్, ప్రధాన కార్యదర్శి పొడిశెట్టి సైదులు గౌడ్, మాజీ సర్పంచ్ బానోత్ జమున, బీసీ సెల్ మండల అధ్యక్షుడు దాసరి శ్రీనివాస్, ఎస్టీ సెల్ మండల అధ్యక్షుడు బానోత్ సీతారాం నాయక్, యూత్ అధ్యక్షుడు బీసు హరికృష్ణ గౌడ్, సుంకరి మురళీధర్, జాటోత్ వెంకన్న, సుధగాని రాంబాబు, సోషల్ మీడియా కోఆర్డినేటర్ ఎరుకుల సమ్మయ్య గౌడ్ తదితరులు ఉన్నారు.
నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES