నవతెలంగాణ మద్నూర్
పొద్దు తిరుగుడు పంట సన్ఫ్లవర్ ను పండించిన రైతులు మద్దతు ధర కొనుగోలు కేంద్రాల్లోని అమ్ముకొని సద్వినియోగం చేసుకోవాలని ప్రవేట్ పరంగా దళారులకు అమ్ముకొని మోసపోవద్దని జుక్కల్ ఎమ్మెల్యే తోటా లక్ష్మి కాంతారావు మంగళవారం సాయంత్రం డోంగ్లి సింగిల్ విండో ఆధ్వర్యంలో సన్ఫ్లవర్ పొద్దు తిరుగుడు పంట కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిస్తూ తెలిపారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో కార్యదర్శి బాబురావు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ డోంగ్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గజానంద్ దేశాయ్ మద్నూర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పరమేష్ పటేల్ ఆ మండలంలోని వివిధ గ్రామాల సర్పంచులు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు పొద్దుతిరుగుడు సన్ఫ్లవర్ పంట రైతులు పాల్గొన్నారు.


