నవతెలంగాణ-హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఏర్పడిన తరువాత ప్రజలు చిత్ర, విచిత్రాలు చూడాల్సిన పరిస్థితి వస్తుంది , పాలసీల పేరు మీద స్కాములు చేస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఆరోపించారు.
భారతదేశ చరిత్రలోనే కాదు ప్రపంచంలోనే అతి పెద్ద స్క్యామ్ తెలంగాణలో జరుగుతుంది, ప్రభుత్వ భూములను ఇష్టం వచ్చినట్లు కట్టబెడుతున్నారని ధ్వజమెత్తారు.10 వేల ఎకరాల విలువైన భూములను కారు చౌకగా, రేవంత్ రెడ్డి ఆత్మీయ బంధువులు అప్పగించేందుకు సిద్ధమయ్యారని విమర్శలు గుప్పించారు. త్వరలోనే వారి వివరాలు బయట పెడతామని, రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులు 40 మంది ఉన్నారని శుక్రవారం తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో చెప్పారు.
సోయి లేని రేవంత్ ప్రభుత్వం హిల్ట్ పి పాలసీతో భూ కబ్జాలకు తెర లేపిందని, మంత్రులకు వాటాలు ఏర్పాటు చేసి నోర్లు మూయించారని ఆరోపించారు. హిల్ట్ పి పాలసీ పేరుతో దోపిడి చేస్తున్నాని, బీఆర్ ఎస్ ఆ దోపిడీని అడ్డుకుంటుందన్నారు. తాము తిరిగి అధికారంలోకి రాగానే భూ కబ్జాదారులను వదిలిపెట్టేది లేదని శపథం చేశారు.



