Wednesday, April 30, 2025
Homeఖమ్మంనాది ప్రజా బాట

నాది ప్రజా బాట

-చెరువుల అనుసంధానంతో సస్యశ్యామలం…
-ఒండ్రు ని సద్వినియోగం చేసుకోండి…
-ఇందిరమ్మ చెరువు బాటలో ఎమ్మెల్యే జారే…

నవతెలంగాణ – అశ్వారావుపేట : నా ప్రతీ అడుగు ప్రజలు వైపే నని,నా నడకే ప్రజా బాట అని స్థానిక ఎమ్మెల్యే జారే ఆదినారాయణ అన్నారు. పంట కాలువల మరమ్మత్తులు పనులకు నీటిపారుదల శాఖ ఆద్వర్యంలో బుధవారం చేపట్టిన ఇందిరమ్మ చెరువు బాట కార్యక్రమాన్ని నియోజక వర్గం కేంద్రం అయిన అశ్వారావుపేట మండలం,నారం వారి గూడెం పంచాయితీ పరిధిలోని నరసింహా సాగర్ (సాగారం) చెరువు వద్ద ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాడు శుభ్రత – పరిశుభ్రత లో భాగంగా పారిశుధ్యం నిర్వహణ కోసం “హలో శుభోదయం”, కళ్యాణ లక్ష్మి,సీఎం ఆర్ ఎఫ్ పంపిణీ కోసం నేరుగా లబ్ధిదారుల వద్దకు “మీ ఎమ్మెల్యే మీ ఇంటికి” పాఠశాల స్థాయిలోనే సాంకేతిక విద్యాభివృద్ధి కోసం “మీ ఎమ్మెల్యే మీ పాఠశాలకు”, పురాతన దేవాలయాల పునరుద్ధరణ కోసం “ఆలయాలు సందర్శన”, పాఠశాలలు పునరుద్ధరణ కోసం “ఇందిరమ్మ బడిబాట”, పంట కాలువల మరమ్మత్తులు కోసం నేడు  “ఇందిరమ్మ చెరువు బాట” ఏది బాట అయినా నాది ప్రజా బాటే నని ఉద్ఘాటించారు. మంగళవారం దమ్మపేట మండలం పూసుకుంట వద్ద జరిగిన సంఘటన గుర్తు చేసేలా నేటి నుండి నా పాలనలో నూతనాధ్యాయం ప్రారంభం అయిందని వ్యాఖ్యానించారు.
మండలంలో 4957 ఎకరాల ఆయకట్టు కు సాగు నీరు అందించే 5 చెరువులకు చెందిన కాలువలు మరమ్మత్తు,మరో రెండు డ్యాం లు నిర్మాణం కోసం రూ.2 కోట్ల 63 లక్షల 52 వేల 7 వందల 55 లు కేటాయించి వ్యయం చేస్తున్నట్లు తెలిపారు.
చెవులు పూడిక తీసే క్రమం వెలికితీసే ఒండ్రు మట్టిని రైతులు తమ పొలాలకు ఎరువుగా వాడుకుని సద్వినియోగం చేసుకోవాలని,అందుకు అవసరం అయిన రైతులు ఆధారాలతో దరఖాస్తు చేసుకుంటే అధికారులు అనుమతి ఇస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఈఈ ఎల్.క్రిష్ణ,ఏఈఈ కేఎన్బీ క్రిష్ణ,ఎంపీఓ సోయం ప్రసాద్,ఆర్ఐ పద్మావతి,కార్యదర్శి వెంకటమ్మ,కాంగ్రెస్ మండల అద్యక్షుడు తుమ్మ రాంబాబు,నాయకులు జూపల్లి రమేష్,ప్రమోద్,మిండ హరిక్రిష్ణ,రైతులు కొనకళ్ళ చెన్నారావు,కొనకళ్ళ క్రిష్ణ,జూపల్లి క్రిష్ణ,సంతపురి చెన్నారావు లు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img