- సంకల్పంతోనే సత్ఫలితాలు వస్తాయని హితవు
- నవతెలంగాణ – అశ్వారావుపేట
- పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులనుఎమ్మెల్యే జారే ఆదినారాయణ గురువారం అభినందించారు. నియోజకవర్గంలోని పలు పాఠశాలల విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఈ ఫలితాలు అశ్వారావుపేట నియోజకవర్గ విద్యా స్థాయిని ప్రతిబింబించడమే కాక ఉపాధ్యాయుల కృషికి, తల్లిదండ్రుల ప్రోత్సాహానికి, విద్యార్థుల పట్టుదలకు నిదర్శనమన్నారు. అశ్వారావుపేట జవహర్ విద్యాలయంలో చదివే పి.సాయి సంతోష్,కే.వర్షిణి, సీహెచ్ శాంతి లు మెరుగైన ఉత్తీర్ణత సాధించటంతో ప్రత్యేకంగా సన్మానించి, విద్యార్థులను ప్రశంసిస్తూ యాజమాన్యాన్ని అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ ఇనుగంటి ప్రవీణ్ కుమార్,సిబ్బంది మోదుగు రమేష్, ఎన్.సత్యనారాయణ, ఎండీ.మిష్కిన్ అలీ తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -