- విశ్రాంత ఉద్యోగి లాజర్ కు పరామర్శ
– బాణసంచా దుకాణం ప్రారంభం
– విద్యుత్ పనులు పరిశీలన
నవతెలంగాణ – అశ్వారావుపేట - స్థానిక ఎమ్మెల్యే జారె ఆదినారాయణ ఆదివారం నియోజక వర్గం కేంద్రం అయిన అశ్వారావుపేట మున్సిపాల్టీలో పర్యటించారు.
- ఇటీవల తీవ్ర అనారోగ్యానికి గురై హైద్రాబాద్ లో చికిత్స పొంది శనివారం మే ఇంటికి వచ్చిన విశ్రాంత ఉద్యోగి,టీవీ 9 నియోజక వర్గ ప్రతినిధి కొల్లి రవికిరణ్ తండ్రి లాజర్ ను ఎమ్మెల్యే జారె ఆదినారాయణ పరామర్శించి ఆరోగ్య వివరాలను ఆరాతీసారు.త్వరగా కోలుకోవాలని కాంక్షించారు.
పట్టణంలో నిర్మాణంలో ఉన్న హై – లెవెల్ ఎలక్ట్రిసిటీ టవర్ పనులను పరిశీలించారు. నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ త్వరితగతిన పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. స్వయం సహాయక సంఘాల మహిళలకు బ్యాంకు లింకేజీ తో ప్రభుత్వం ఆర్ధిక రుణం తో మున్సిపాలిటీ లో ఏర్పాటు చేసిన బాణసంచా దుకాణాన్ని ఎమ్మెల్యే జారె ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మహిళల అభివృద్ధి కోసం అనేక సంక్షేమ పధకాలు అమలు చేస్తుందని,ప్రభుత్వం నిర్దేశించిన రుణాలను సక్రమంగా వినియోగించుకుని మహిళలు ఆర్థికంగా బలోపేతం అవ్వాలని సూచించారు. కార్యక్రమంలో ఆత్మ – బీఎఫ్ఏసీ చైర్మన్ సుంకవల్లి వీరభద్రరావు,కాంగ్రెస్ మండల అధ్యక్షులు తుమ్మ రాంబాబు, నాయకులు జూపల్లి ప్రమోద్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.