- Advertisement -
– ఇందిరమ్మ గృహాం మంజూరు చేస్తామని హామీ
– తక్షణ సహాయం గా రూ.10 వేలు అందజేత
నవతెలంగాణ – అశ్వారావుపేట
మండలంలోని నారంవారిగూడెం కాలని లో ఇటీవల జరిగిన అగ్ని ప్రమాద బాధిత కుటుంబాన్ని ఆదివారం ఎమ్మెల్యే జారె ఆదినారాయణ పరామర్శించారు.విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా దగ్ధం అయిన రేకుల షెడ్డు యజమానులు యలమర్తి రమాదేవి – కోటేశ్వరరావు లను ఓదార్చి రేకుల షెడ్డు అగ్ని ప్రమాదానికి కారణాలను అడిగి తెలుసుకున్నారు. తక్షణ ఆర్థిక సహాయంగా రూ.10 వేలు అందించారు. ఈ సందర్భంగా ప్రభుత్వపరంగా అన్ని విధాల ఆదుకుంటామని భరోసా కల్పిస్తూ త్వరలోనే ఇందిరమ్మ ఇంటిని మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు.ఆయన వెంట పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
- Advertisement -



