నవతెలంగాణ-హైదరాబాద్ : ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అరెస్టు విషయంలో సీఎం రేవంత్ రెడ్డి నిరంకుశ వైఖరిని ఖండిస్తున్నట్లు బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఈ అరెస్టు దుర్మార్గమైన చర్య అని విమర్శించారు. ‘సీఎం అక్రమాలు, మంత్రుల అవినీతిని ప్రశ్నిస్తున్నందుకు తప్పుడు కేసులు పెడుతున్నారు. పనికిరాని కేసులతో బీఆర్ఎస్ నేతల మనోధైర్యాన్ని దెబ్బతీయలేరు. హామీలు అమలు చేయలేక ప్రజల దృష్టి మరల్చేందుకే దారుణాలు చేస్తున్నారు. మా నేతలపై ఎన్ని అక్రమ కేసులు పెట్టినా.. అవి కోర్టుల్లో నిలబడే అవకాశం లేదు. ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డిని బేషరతుగా వెంటనే విడుదల చేయాలి. ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా ప్రజల పక్షాన పోరాడుతూనే ఉంటాం’’ అని కేటీఆర్ అన్నారు.
ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డిని వెంటనే విడుదల చేయాలి : కేటీఆర్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES