Thursday, May 1, 2025
Homeజిల్లాలుగాంధీజీ విద్యాసంస్థలను అభినందించిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి

గాంధీజీ విద్యాసంస్థలను అభినందించిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి

జిల్లా టాపర్ అమూల్యశ్రీని అభినందించిన ఎమ్మెల్యే
నవతెలంగాణ – చండూరు

తెలంగాణ ప్రభుత్వం బుధవారం  ప్రకటించిన పదవ తరగతి ఫలితాల్లో చండూరు మున్సిపాలిటీలోని గాంధీజీ విద్యాసంస్థలకు చెందిన విద్యార్థిని గుడిసె అమూల్య శ్రీ, మండల ర్యాంకర్లను  గురువారం  ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి మునుగోడు క్యాంపు కార్యాలయం లో ఘనంగా సన్మానించి, అభినందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతమైన కోటయ్యగూడెంనకు చెందిన అమ్మాయి 590 మార్కులతో ఉమ్మడి నల్గొండ జిల్లా మొదటి ర్యాంకును  స్టేట్ ర్యాంకు సాధించడం మునుగోడు నియోజకవర్గానికి గర్వకారణమని, అమ్మాయికి విద్యను అందించిన గాంధీజీ విద్యాసంస్థల యాజమాన్యాన్ని, ఉపాధ్యాయులను, తల్లిదండ్రులను అభినందిస్తున్నానని తెలిపారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో వేయిల పాఠశాలల్లో గాంధీజీ పాఠశాల మొదటి ర్యాంకును సాధించడం అభినందనీయమని అన్నారు. విద్యార్థులలో ఎల్లవేళలా పోరాడే తత్వం ఉండాలని, ఒకసారి తక్కువ మార్కులు వచ్చాయి కుంగిపోకుండా అనునిత్యం పోరాడుతూనే ఉండాలని, ప్రతి విద్యార్థి ఓటమిని పాఠంగా స్వీకరించాలన్నారు. మునుగోడు ఉప ఎన్నికల్లో ఓటమి చెందానని ఇంట్లోనే కూర్చుంటే మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యేగా తాను గెలిచే వాడిని కానని ఉదహరిస్తూ… తక్కువ మార్కులు వచ్చాయని ఎప్పుడూ కూడా కృంగిపోవద్దని, మునుముందు బాగా చదివి ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలని విద్యార్థుల్లో చైతన్యాన్ని నిలిపారు. సన్మానం పొందిన వారిలో మండల రెండవ ర్యాంకు పందిరి శివప్రియ రెడ్డి 579 మార్కులు, మండల మూడవ ర్యాంకు ధార హాసిని 577 మార్కులు, మండల నాల్గవ ర్యాంకు ఉప్పల రేణుక 575 మార్కులు, మండల ఐదవ ర్యాంకు నకిరేకంటి హన్సిక 574 మార్కులు, ఆవుల శివాని 574 మార్కులు, మండల ఆరవ ర్యాంకు తుమ్మల నేహ శ్రీ 573 మార్కులు, మండల ఏడవ ర్యాంకు పెండెం శృతి 572 మార్కులు, మండల ఎనిమిదవ ర్యాంకు పూజా వైష్ణవి, అజయ్ లు ఉన్నారు. ఈ కార్యక్రమంలో ట్రస్మా జిల్లా అధ్యక్షులు, గాంధీజీ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు, డైరెక్టర్ సరికొండ వెంకన్న, కర్నాటి నాగరాజు, ప్రిన్సిపాల్ సత్యనారాయణ మూర్తి, వెంకటేశ్వర్లు, పులిపాటి రాధిక, చిలుకూరి రామేశ్వరి, ఉపాధ్యాయులు, విద్యార్థుల  తల్లిదండ్రులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img