నవతెలంగాణ-భువనగిరి: భువనగిరి అభివృద్ధి పై ఎమ్మెల్యే కుంభ అనిల్ కుమార్ రెడ్డి.. అడిషనల్ కలెక్టర్ భాస్కరరావు, ట్రాఫిక్ ఏసిపి ప్రభాకర్ రెడ్డి మున్సిపల్ కమిషనర్ రామలింగం, జాతీయ రహదారి డిఇలతో ఇతర అధికారులతో, పట్టణంలోని వివిధ రాజకీయ పార్టీల ప్రముఖులతో వేరువేరుగా సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..జగదేవ్ పూర్ రోడ్డుపై జరుగుతున్న ప్రమాదాలపై వారం రోజుల క్రితం అధికారులతో మాట్లాడి ఆ రోడ్డుపై ఒక నివేదిక ఇయ్యాలని కోరారు. ట్రాఫిక్ నియంత్రణ, అభివృద్ధి పనులు, పెండింగ్ పనులు పలు అంశాలను చర్చించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. భువనగిరి నుండి గజ్వేల్ వరకు వెళ్లే జాతీయ రహదారి 70 కిలోమీటర్లు రోడ్డు మరమ్మత్తు పనులకు రూపాయలు ఏడు కోట్లు నిధులు మంజూరయ్యాయని తెలిపారు.
భువనగిరి పట్టణంలోని జగదేవ్ పూర్ బ్రిడ్జి మరమ్మతులకు 76 లక్షల రూపాయల మంజూరు అయ్యాయి త్వరలో పనులు ప్రారంభం అవుతాయన్నారు. పట్టణంలో అన్ని చౌరస్థాల సుందరీకరంగా తీర్చిదిద్దుతామన్నారు. భువనగిరి పట్టణ అభివృద్ధి కోసం పుర ప్రముఖులు వివిధ పార్టీ నాయకులతో సమావేశమై ప్రతి సమస్యను పరిష్కరించడానికి కృషి చేస్తామన్నారు. భువనగిరి అభివృద్ధి కోసం అధికారులు, ప్రజలు సహకరించాలని కోరారు