నవతెలంగాణ-ఆర్మూర్: విజయదశమి సందర్భంగా గురువారం నందిపేట మండల కేంద్రంలో మంగి రాములు మహారాజ్ 40వ సారి అనుష్ఠాన దీక్ష కార్యక్రమం చేపడుతున్న సందర్భంగా ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి , సతీమణి పైడి రేవతి రెడ్డి తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మహారాజ్ ఉన్న ప్రాంతం చుట్ట పక్కల గ్రామాలు దైవ చింతనతో ఆహ్లాదంగా ఉందని, కంటికి కనపడే తల్లితండ్రులు దైవంతో సమానం అని, వారిని ఆలాపా పాలనా చూస్తూ చూసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు పటేల్ రాజు,కొండూరు రాజు, లక్కంపల్లి చిన్నయ్య, నర్సగౌడ్,నాగ సురేష్ తదితరులు పాల్గొన్నారు.
జాంబి హనుమాన్ ఆలయంలో…
మండలంలోని అంకాపూర్ గ్రామంలో శుక్రవారం అలయ్ భాలయ్ కార్యక్రమంలో నిర్వహించినారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తనకు జన్మనిచ్చిన ఊరులో అభివృద్ధి కోసం మాత్రమే పని చేస్తానని, అన్ని పార్టీల వారితో బంధుత్వం స్నేహం ఉందని జాతీయ పసుపు బోర్డు చైర్మన్ సోదరుడు తో సమానం అని మార్క్ ఫెడ్ చైర్మన్ మర గంగారెడ్డి అన్నారు. ఎమ్మెల్యే గా కాకుండా గ్రామ బిడ్డగా గర్వంగా చెప్పుకుంటారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి ,మరగంగారెడ్డి,చంద్ర మోహన్ రెడ్డి, సల్ల నర్సారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
పట్టణంలోని రాష్ట విత్తన అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాతల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొని మాట్లాడుతూ..దేశానికి వెన్నుముక రైతులు అని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో పలు గ్రామాల నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు..
ఫోటో రైట్ అప్.. అంకాపూర్ గ్రామంలో జరిగిన అలాయి బలాయి కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే