Thursday, April 2, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్హనుమాన్ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి

హనుమాన్ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి

- Advertisement -

నవతెలంగాణ-కమ్మర్ పల్లి : వేల్పూర్ మండల కేంద్రంలో గురువారం జరిగిన హనుమాన్ జయంతి వేడుకల్లో రాష్ట్ర మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. హనుమాన్ జయంతి సందర్భంగా గ్రామంలోని  జంబీ హనుమాన్, అభయాంజనేయ స్వామి వారిని ఆయన దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డికి ఆలయ పూజారులు స్వామి వారి ఆశీస్సులు, తీర్థ ప్రసాదాలను అందజేశారు. ప్రజలంతా సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఆంజనేయస్వామిని వేడుకున్నట్లు ఈ సందర్భంగా మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -