Tuesday, April 7, 2026
E-PAPER
Homeఆదిలాబాద్సీఎంకు గతంను గుర్తుచేసిన ఎమ్మెల్యే

సీఎంకు గతంను గుర్తుచేసిన ఎమ్మెల్యే

- Advertisement -

– ట్రిపుల్ ఐటీకీ ట్రాక్టర్ పై వచ్చిన ఫొటోను చూపించిన ఎమ్మెల్యే
నవతెలంగాణ – ముధోల్: బాసర పర్యటనకు వచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి గతంను గుర్తుచేసి ట్రిపుల్ ఐటీ సమస్యలు పరిష్కరించాలని ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ విన్నవించారు. సోమవారం రోజు బాసర ఆలయ పునర్నిర్మాణం భూమి పూజకు వచ్చిన సీఎంకు ట్రిపుల్ ఐటీలో నెలకొన్న సమస్యలను ఎమ్మెల్యే ఏకరువు పెట్టారు. గతంలో త్రిబుల్ ఐటీ విద్యార్థుల సమస్యల పరిష్కారానికి ఆందోళన చేస్తున్న క్రమంలో సంఘీభావం తెలపడానికి గతంలో ప్రతిపక్ష హోదాలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా పని చేసిన రేవంత్ రెడ్డి ట్రిపుల్ ఐటీకి  రావటానికి  17జూన్ 2022లో  ప్రయత్నం చేయగా పోలిసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. 

గత ప్రభుత్వం ఎక్కడికక్కడ పోలీసులను మోహరించి త్రిబుల్ ఐటీకి రేవంత్ రెడ్డి రాకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినప్పటికీ, పోలీసుల కళ్ళు కప్పి దొడ్డి దారిన రేవంత్ రెడ్డిని, గత నిర్మల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడుగా పనిచేసిన పవార్ రామారావు పటేల్ సూచన మేరకు యువ నాయకులు పట్టెపురం సతీష్ రెడ్డి  ద్విచక్ర వాహనం పై తీసుకువచ్చారు. ఆనంతరం మహారాష్ట్ర సరిహద్దు శివారులో నుండి ట్రాక్టర్ ద్వారా  రెవంత్ రెడ్డి ని ట్రిపుల్ ఐటీకి  తీసుకువచ్చారు. అయితే ఈ విషయంను సంబంధించిన ఫొటోలను ఈ సందర్భంగా సీఎంకు ఎమ్మెల్యే చూపించారు. మీరు సీఎం అయ్యరు. నేను  ఎమ్మెల్యే అయ్యానని గుర్తు చేశారు. ట్రిపుల్ ఐటీలో నెలకోన్న సమస్యలను పరిష్కరించాలని సీఎంను ఎమ్మెల్యే కోరారు. స్పందించిన సీఎం ట్రిపుల్ ఐటీలో నెలకొన్న సమస్యలు తన దృష్టికి వచ్చాయని సీఎం తెలిపినట్లు అక్కడున్న నాయకులు నవతెలంగాణకు చెప్పారు. త్వరలో ప్రక్షాళనకు చర్యలు తీసుకుంటానని సీఎం భరోసా ఇచ్చాడని  వారు పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -