Sunday, November 9, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రైతాంగ సమస్యలపై ఎమ్మెల్యే స్పందించాలి: సీపీఐ(ఎం)

రైతాంగ సమస్యలపై ఎమ్మెల్యే స్పందించాలి: సీపీఐ(ఎం)

- Advertisement -

నవతెలంగాణ – నవీపేట్
భారీ వర్షాల కారణంగా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి స్పందించాలని సీపీఐ(ఎం) మండల కార్యదర్శి నాయక్ వాడి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. మండల కేంద్రంలో ఇరగొట్టు వడ్డెన్న అధ్యక్షతన ప్రజాసంఘాల సమావేశాన్ని ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారీ వర్షాల కారణంగా ధాన్యం తడిసి మొలకలు వచ్చి రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. తరుగు పేరుతో రైతులను దోపిడీ చేయడం సరైంది కాదని అన్నారు. రైతులు కోత మిషన్లు దొరకక ఇబ్బందుల పాలవుతున్నారని అన్నారు. కాబట్టి రైతుల సమస్యలపై స్థానిక ఎమ్మెల్యే స్పందించి సమస్యల పరిష్కారం కోసం అధికార యంత్రాంగాన్ని సిద్ధం చేయాలని అన్నారు. లేనియెడల రైతాంగాన్ని సమీకరించి ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం మండల కన్వీనర్ వసంత్, మహిళా సంఘ నాయకురాలు సావిత్రి, ఆవాజ్ నాయకులు షేక్ మహబూబ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -