- Advertisement -
నవతెలంగాణ-ఆమనగల్
మాజీ మంత్రి హరీష్ రావు తండ్రి సత్యనారాయణ రావు ఇటీవల మృతి చెందారు. విషయం తెలుసుకున్న కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి శనివారం హైదరాబాద్ లోని వారి స్వగృహానికి వెళ్లి సత్యనారాయణ రావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. హరీష్ రావు తోపాటు వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. ఎమ్మెల్యే వెంట కాంగ్రెస్ సీనియర్ నాయకులు సురేందర్ రెడ్డి, సురభి వెంకటేశ్వరరావు తదితరులు ఉన్నారు.
- Advertisement -



